
పర్వతంపై ఏఎస్పీ (ఇన్‌సెట్‌లో) రాధిక
చిత్తూరు రూరల్: చిత్తూరు జిల్లా ఏఎస్పీ రాధిక దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాంకాగ్వాను విజయవంతంగా అధిరోహించారు. ఈ పర్వతం అర్జెంటీనాలో ఉంది. దీని ఎత్తు 6,962 మీటర్లు. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢత్వం అవసరం. గతంలో ఈమె అనేక పర్వతాలను అధిరోహించి పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను పెంచారు. ఈమె జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబులతో పాటు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఏఎస్పీ అక్కడి నుంచి స్వదేశానికి ఈ నెల 6వ తేదిన తిరిగిరానున్నారు.