ఫోన్‌పే చేతికి జాపర్‌ రిటైల్‌

Zopper retail handed over to phone pay - Sakshi

న్యూఢిల్లీ: జాపర్‌ రిటైల్‌ సంస్థను డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే కొనుగోలు చేసింది. ఆఫ్‌లైన్‌ వ్యాపార విస్తరణలో భాగంగా జాపర్‌ను కొనుగోలు చేసినట్లు ఫోన్‌పే తెలిపింది. ఈ డీల్‌ ఆర్థిక వివరాలేవీ వెల్లడి కాలేదు. చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసం హైపర్‌ లోకల్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) ప్లాట్‌ఫామ్‌ను జాపర్‌ రిటైల్‌ నిర్వహిస్తోంది.

కాగా మూడు లక్షలకు పైగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఫోన్‌ పే చెల్లింపులను అంగీకరిస్తున్నాయి. ఈ ఏడాది మేలో కంపెనీ వినియోగదారుల సంఖ్య పదికోట్లను, వార్షిక చెల్లింపుల టర్నోవర్‌ 2,000 కోట్ల డాలర్లను దాటాయి.   

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top