షావోమి మొబైల్స్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ | Xiaomi's path to the West gets a little easier with Microsoft patent deal | Sakshi
Sakshi News home page

షావోమి మొబైల్స్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్

Jun 2 2016 1:55 AM | Updated on Sep 4 2017 1:25 AM

షావోమి మొబైల్స్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్

షావోమి మొబైల్స్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్

చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్‌లను కొనుగోలు చేసింది.

మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్స్ కొనుగోలు చేసిన షావోమి

 న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్‌లను కొనుగోలు చేసింది. ఈ పేటెంట్లు వీడియో, క్లౌడ్, మల్టీమీడియా టెక్నాలజీలకు సంబంధించినవి. ఈ ఒప్పందంలో భాగంగా షావోమి.. తన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్‌లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ (ఆఫీస్, స్కైప్‌తోపాటు)ను అప్‌లోడ్ చేసి, వాటిని ఇండియా, చైనాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది. పేటెంట్ల కొనుగోలు సంబంధించిన ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు బయటకు వెల్లడికాలేదు. షావోమి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్కైప్‌లను తన పలు మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో ప్రి-లోడింగ్ చేయనున్నది. ఈ ఫోన్లు తొలిగా చైనాలో, తర్వాత భారత్‌లో అందుబాటులోకి రానున్నవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement