మరోసారి సేల్‌కు వచ్చిన షావోమి పోకో ఎఫ్‌1

Xiaomi Poco F1 Sale Today Via Flipkart, Mi.com - Sakshi

మొబైల్‌ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్‌ దిగ్గజం షావోమి. ఈ కంపెనీ తన సబ్‌బ్రాండ్‌ పోకో కింద పోకో ఎఫ్‌1 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే నాలుగుసార్లు విక్రయానికి వచ్చి అదరగొట్టింది. నేడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ మరోసారి విక్రయానికి వచ్చింది. పోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లో విక్రయానికి ఉంచింది షావోమి కంపెనీ. మూడు వేరియంట్లు ఒకటి.. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ మోడల్(ధర రూ.20,999), రెండు... 8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ఆప్షన్(రూ.28,999), మూడు.. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ మోడల్‌ స్పెషల్‌ ఎడిషన్‌(ధర రూ.29,999)ను అందుబాటులో ఉంచింది. గ్రాఫైట్‌ బ్లాక్‌, స్టీల్‌ బ్లూ వేరియంట్లు ఫ్లిప్‌కార్ట్‌, షావోమి అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ వేరియంట్‌ ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉంది. 

పోకో  ఎఫ్‌ 1 ఫీచర్లు
6.18 అంగుళాల డిస్‌ప్లే
1080x2160  పిక్సెల్స్‌రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా,
4000ఎంఏహెచ్ బ్యాటరీ
మాస్టర్‌ ఆఫ్‌ స్పీడ్‌ గా ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితర ఫీచర్లతో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమి కంపెనీ. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top