స్పెషల్‌ ఫీచర్లతో షావోమి స్మార్ట్‌ఫోన్లు

Xiaomi Mi 8 jumps on the in-display fingerprint scanner bandwagon - Sakshi

చైనా మొబైల్‌ మేకర్‌ షావోమీ కూడా ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ వైపు మొగ్గు చూపింది. ఒప్పో, వివో  స్మార్ట్‌ఫోన్ల తరహాలోనే ఐఆర్ ఫేస్ అన్‌లాక్  ప్రధాన ఫీచర్‌గా  నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  భారీ స్క్రీన్‌, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి  ఆకట్టుకునే ఫీచర్లతో ఎంఐ 8  ఫ్యామిలీ కొనసాగింపుగా ఎంఐ 8ప్రొ  పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను  చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. రూ.33,945 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.  హై ఎండ్‌ వేరియంట్‌ ధర 38,000 రూపాయలుగా ఉండనుంది. దీంతోపాటు  ఎంఐ 8 లైట్‌ను యూత్‌ ఎడిషన్‌ కూడా విడుదల చేసింది.  

ఎంఐ8 ప్రొ ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, 845 ప్రాసెసర్,
6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
12+ 12ఎంపీ డ్యుయల్  రియర్‌ కెమెరా
20 ఎంపీ  సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఎంఐ8 లైట్‌(యూత్ ఎడిషన్) ఫీచర్లు
6.26 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 సాక్‌
12 +5 ఎంపీ  ద్వంద్వ వెనుక కెమెరా
24ఎంసీ సెల్ఫీ కెమెరా  
3,350 ఎంఏహెచ్‌బ్యాటరీ

4జీబీ /64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర   సుమారు 15వేలు, అలాగే 6జీబీ/64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర  రూ.  18,000. అలాగే 6జీబీ /128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. సుమారు 21, 000

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top