షావోమి ఆ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది

Xiaomi Announces Price Cut On Mi Mix 2 - Sakshi

న్యూఢిల్లీ : షావోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఎంఐ మిక్స్‌2 గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం షావోమి ధర తగ్గించింది. 2017 అ‍క్టోబర్‌లో లాంచింగ్‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 35,999 రూపాయలుగా ఉంటే, తాజాగా ధర తగ్గింపు అనంతరం ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను 29,999 రూపాయలకు విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ మిక్స్‌2పై ధర తగ్గింపును శాశ్వతంగా చేపడుతున్నట్టు షావోమి ధృవీకరించింది. ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌, అధికారిక పార్టనర్లలో తగ్గింపు ధరలు అమ్లోకి రానున్నాయని షావోమి పేర్కొంది. ఇప్పటికే ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో తగ్గింపు ధర అందుబాటులోకి వచ్చింది. జనవరిలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ఫై 3వేల రూపాయల ధర తగ్గించి 32,999 రూపాయలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా షావోమి ప్రత్యర్థి వన్‌ప్లస్‌ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 ను భారత్‌లో లాంచ్‌ చేసిన ఒక్కరోజులోనే ఈ ధర తగ్గింపును చేపట్టింది. 

ఎంఐ మిక్స్‌2 స్పెషిఫికేషన్లు...
5.99 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6 జీబీ ర్యామ్‌, 12 జీబీ స్టోరేజ్‌
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫేసియల్‌ రికగ్నైజేషన్‌
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
జూన్‌ 7న మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను షావోమి భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ను సెల్ఫీ సెట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి అభివర్ణించింది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top