ఇంటి ఎంపికలో గృహిణిదే ఆధిపత్యం 

In womens choice women are more than men - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సొంతింటి ఎంపికలో మగవాళ్ల కంటే మహిళలదే పైచేయి. సొంతిల్లు కొనుగోలు నిర్ణయం నుంచి ప్రాంతం, బడ్జెట్‌ ఎంపిక వరకూ అన్నింట్లోనూ గృహిణి నిర్ణయాధికారమే ఆధిపత్యంగా ఉందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కన్జ్యూమర్‌ రీసెర్చ్‌ సర్వే తెలిపింది. గృహ నిర్మాణానికి సంబంధించి కొనుగోలుదారుల అభిప్రాయం, ఎంపికలపై సర్వే నిర్వహించింది. జాయింట్‌ ఫ్యామిలీ బదులు సొంతంగా ఉండేందుకే మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. సొంతింటి ఎంపిక విషయంలో మగవాళ్లు స్నేహితులు లేదా బంధుమిత్రుల నిర్ణయాలనే పాటిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలి? నిర్మాణ తీరుతెన్నుల గురించి భార్య కంటే ఎక్కువగా ఫ్రెండ్స్‌ సలహాలే పాటిస్తారని సర్వే తెలిపింది. స్టీల్, సిమెంట్, కాంక్రీట్, బ్రిక్స్, ఎలక్ట్రిక్‌ వైర్లు, శానిటేషన్‌ ఉత్పత్తులు వంటి గృహ నిర్మాణ సామగ్రి నాణ్యత, ఎంపికలపై కొనుగోలుదారులకు పూర్తి స్థాయి అవగాహన లేదని.. అందుకే నిర్మాణంలో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తుందని సర్వే వెల్లడించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top