జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం! | What's different about the new GDP | Sakshi
Sakshi News home page

జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం!

Mar 9 2015 12:45 AM | Updated on Sep 22 2018 8:07 PM

జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం! - Sakshi

జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం!

ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం పైనే ఉండొచ్చన్న ప్రభుత్వ అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని..

అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల అభిప్రాయం
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం పైనే ఉండొచ్చన్న ప్రభుత్వ అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని.. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టడం లేదని మెజారిటీ కార్పొరేట్లు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ‘కొత్త డేటా ప్రకారం 7 శాతంపైగా వృద్ధి రేటు మరీ ఆశాజనకంగా ఉంది.

వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో ఇంత సానుకూల పరిస్థితులేమీ కనబడటం లేదు’ అని కార్పొరేట్ సారథులు వ్యాఖ్యానించారు. బడ్జెట్ తర్వాత జరిపిన ఈ సర్వేలో వివిధ కంపెనీలకు చెందిన 189 మంది సీఈఓలు, సీఎఫ్‌ఓలు పాల్గొన్నారు. బేస్ సంవత్సరాన్ని మార్చడం(2004-05 నుంచి 2001-12కు)తో ఈ ఏడాది(2014-15) జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదుకానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2013-14 వృద్ధి గణాంకాలను సవరించారు. 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు. కాగా, పాత బేస్ ఇయర్ ప్రకారం ఈ ఏడాది వృద్ధి రేటు 5.5 శాతంగా గతంలో కేంద్రం అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో వృద్ధి రేటు 8.1-8.5% స్థాయిలో ఉండొచ్చని బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించడం విదితమే. సర్వేలో ఇతర ముఖ్యాంశాలివీ..
     
కొత్త డేటా ప్రకారం ప్రభుత్వ ఆశావహ అంచనాలు సరైనవేనన్న అభిప్రాయానికి రావాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 71 శాతం సీఈఓలు పేర్కొన్నారు.
అమ్మకాలు భారీగా పుంజుకోవడం, ఉత్పాదకత మరింత మెరుగుపడాల్సి ఉందని 68 శాతం సీఎఫ్‌ఓలు అభిప్రాయపడ్డారు.
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన పలు కీలక ప్రతిపాదనలు, చర్యలు కార్యరూపందాల్చి ఫలితాలు వచ్చేందుకు కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.
చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ)ల కోసం ముద్రా బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల పెంపు, ఇన్‌ఫ్రా రంగానికి బూస్ట్ ఇచ్చేలా తీసుకున్న చర్యలు, కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రతిపాదనలను ఆయన ఉదహరించారు.
ఈ ఏడాదికి 7 శాతంపైనే వృద్ధి అంచనాలను చూస్తే.. భారత్ ఎన్నడూ మందగమనాన్ని చవిచూడనట్లు లెక్క అని కూడా అసోచామ్ వ్యాఖ్యానించింది.
గతేడాది ఆర్థిక వ్యవస్థ ఎంత గడ్డుకాలాన్ని ఎదుర్కొందో పరిశ్రమవర్గాలు అందరికీ తెలిసిందే. అయినా, వృద్ధి రేటును 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచడాన్ని(కొత్త బేస్ ఇయర్ ప్రకారం) కార్పొరేట్లు గుర్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement