అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌: రోజుకు 180 రూపాయలు | Vodafone India launches unlimited international plan for Rs 180 per day | Sakshi
Sakshi News home page

అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌: రోజుకు 180 రూపాయలు

Sep 13 2017 4:22 PM | Updated on Sep 19 2017 4:30 PM

అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌: రోజుకు 180 రూపాయలు

అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌: రోజుకు 180 రూపాయలు

వొడాఫోన్‌ ఇండియా తన కస్టమర్లకు ఓ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నేషనల్‌ ప్లాన్‌ను బుధవారం ఆవిష్కరించింది.

సాక్షి, ముంబై : వొడాఫోన్‌ ఇండియా తన కస్టమర్లకు ఓ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నేషనల్‌ ప్లాన్‌ను బుధవారం ఆవిష్కరించింది. రోజుకు 180 రూపాయలకు యూకే, యూరప్‌ ప్రాంత ప్రయాణికులకు ఈ అపరిమిత అంతర్జాతీయ ప్లాన్‌ను లాంచ్‌చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు ఇప్పుడు చాలా తేలికగా ఈ ప్యాక్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చని, యూకే, యూరప్‌లోని ప్రముఖ సందర్శన ప్రాంతాల నుంచి తమ నెంబర్‌ను వాడుకోవచ్చని వొడాఫోన్‌ తెలిపింది. యూరప్‌ మినహా అమెరికా, యూఏఈ, సింగపూర్‌, మలేషియా ప్రయాణికులు ఇదే ప్యాక్‌పై అపరిమిత కాలింగ్‌తో పాటు, డేటాను వాడుకోవచ్చని చెప్పింది. మొత్తం 18 దేశాలకు ఈ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఈ ప్యాక్‌ కింద 28 రోజులకు రూ.5000, 24 గంటల వాడకానికి రూ.500 ధరల శ్రేణి కూడా ఉంది. ఏప్రిల్‌లోనే అమెరికా, సింగపూర్‌, యూఏఈలకు తమ అపరిమిత అంతర్జాతీయ రోమింగ్‌ను లాంచ్‌ చేశామని, ప్రస్తుతం ఈ ప్యాక్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం చాలా ఆనందంగా ఉందని వొడాఫోన్‌ ఇండియా కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అ‍న్వేష్‌ ఖోస్లా చెప్పారు. యూరప్‌, అమెరికా, యూఏఈ, సింగపూర్‌, మలేషియాల్లో మొత్తం రోమర్లు 50 శాతం పైగానే ఉన్నారని చెప్పారు. ఈ దేశాల్లో కాల్స్‌, డేటా పూర్తిగా ఉచితమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement