మరో అద్భుతమైన వివో స్మార్ట్‌ఫోన్‌ | VIvo V15 Pro Will Have a 48MP Main Camera | Sakshi
Sakshi News home page

మరో అద్భుతమైన వివో స్మార్ట్‌ఫోన్‌

Feb 9 2019 9:13 AM | Updated on Feb 9 2019 9:24 AM

VIvo V15 Pro Will Have a 48MP Main Camera - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లకు పెట్టింది పేరైన వివో సెల్ఫీ లవర్స్‌​కోసం అద్భుతమైన  మొబైల్‌ను ఆవిష్కరించనుంది. భారీ సెల్ఫీ కెమెరాతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే  భారతీయ మార్కెట్లను పలకరించనున్నాయి. వివో వీ15, వివో వీ15 ప్రో పేరుతో రెండు ఫోన్లను ఫిబ్రవరి 20న ఇండియాలో లాంచ్‌ చేస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్లలోని 32 మెగా పిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా..  మొబైల్‌ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. రియర్‌లో 48ఎంపీతోపాటు ట్రిపుల్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. వివో వీ15, వివో వీ15 ప్రో మోడల్స్ లాంఛ్ కానున్నాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం వివో 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి. ఈ మేరకు వివో బ్రాండ్‌ అంబాసిడర్‌ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ టీజర్‌ వీడియో కూడా హల్‌ చల్‌ చేస్తోంది. 

వివో వీ15 ప్రో ఫీచర్లు
 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
48+8+5 మెగాపిక్సెల్రియర్ కెమెరా 
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: సుమారు రూ.30వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement