శ్రీసిటీలో వయ లైఫ్‌ తయారీ కేంద్రం! | vaya life Manufacturing center in sri city | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో వయ లైఫ్‌ తయారీ కేంద్రం!

Jun 24 2017 1:18 AM | Updated on Sep 5 2017 2:18 PM

శ్రీసిటీలో వయ లైఫ్‌ తయారీ కేంద్రం!

శ్రీసిటీలో వయ లైఫ్‌ తయారీ కేంద్రం!

హోమ్‌ వేర్‌ ఉత్పత్తుల తయారీలో ఉన్న వయ లైఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హోమ్‌ వేర్‌ ఉత్పత్తుల తయారీలో ఉన్న వయ లైఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చైనా నుంచి విడిభాగాలను తెస్తోంది. ఒకటిరెండేళ్లలో ఇండియాలోనే తయారీ కేంద్రం పెడతామని వయ ఫౌండర్, సీఈవో వశిష్ట్‌ వసంతకుమార్‌ చెప్పారు.

రూ.3 వేల ధరలో ఒక లీటరు సామర్థ్యంగల ఫుడ్‌ కంటైనర్‌ను (టిఫిన్‌ బాక్స్‌) శుక్రవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో ఈ విషయం చెప్పారు. ‘బాక్సుల తయారీలో వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను వాడాం. 4–6 గంటల వరకు బాక్సులోని ఆహార పదార్థాలు వేడిగా ఉంటాయి. దీనికి సంబంధించి 3 డిజైన్‌ పేటెంట్లు దక్కించుకున్నాం. ఆన్‌లైన్‌ ద్వారా 80 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి’ అని చెప్పారాయన. ఉత్పత్తుల ధర రూ.1,890–3,000 ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement