వారమంతా పైపైకే... | varantha paipaike | Sakshi
Sakshi News home page

వారమంతా పైపైకే...

Jun 20 2015 1:50 AM | Updated on Sep 3 2017 4:01 AM

వర్షాలు జోరుగా కురుస్తుండటంతో స్టాక్ మార్కెట్ పై లాభాల జడివాన కురిసింది. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్

విస్తార వర్షాలతో తొలగిన కరువు భయాలు
27,318 పాయింట్లకు సెన్సెక్స్
8,225 పాయింట్లకు నిఫ్టీ

 
 వర్షాలు జోరుగా కురుస్తుండటంతో స్టాక్ మార్కెట్ పై లాభాల జడివాన కురిసింది. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తుండటంతో కరువు భయాలు తొలగి వాహన, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 18 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టడం... వీటన్నింటి కారణాల వల్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 27,316 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 8,225పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 891 పాయింట్లు(3.4 శాతం). నిఫ్టీ 242 పాయింట్ల(3 శాతం)  చొప్పున పెరిగాయి. గత మూడు వారాల్లో నష్టాల పాలవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం లాభాల్లో ముగిశాయి.

 దేశీయ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు...
 ఈ వారమంతా  దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు పెరిగాయి.

 లాభ నష్టాలు...
 1,411 షేర్లు లాభాల్లో, 1,235 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,543 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,554 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,68,439 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.106 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.448 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. చైనా  మార్కెట్ ఆరు% పతనమవ్వగా, మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
 
 మళ్లీ వంద లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్...
 బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం వంద లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఈ నెల 3న రూ.100 లక్షల కోట్ల దిగువకు పడిపోయిన ఈ మొత్తం శుక్రవారం రూ.100.04 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ తొలిసారిగా వంద లక్షల కోట్ల మార్క్‌ను గత ఏడాది నవంబర్‌లో అధిగమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement