ఐఎస్‌బీ-ఐఐసీఏ సంయుక్త కోర్సు | US Of course isb- iica | Sakshi
Sakshi News home page

ఐఎస్‌బీ-ఐఐసీఏ సంయుక్త కోర్సు

Dec 4 2014 12:08 AM | Updated on Sep 2 2017 5:34 PM

ఐఎస్‌బీ-ఐఐసీఏ సంయుక్త కోర్సు

ఐఎస్‌బీ-ఐఐసీఏ సంయుక్త కోర్సు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్....

సీఎస్‌ఆర్ మేనేజ్‌మెంట్‌పై స్వల్పకాలిక కోర్సు నిర్వహణ కోసం న్యూఢిల్లీలో  బుధవారం ఐఐసీఏ డెరైక్టర్ జనరల్, సీఈఓ డాక్టర్ భాస్కర్ చటర్జీ, ఐఎ్‌స్‌బీ డిప్యూటీ డీన్ ప్రదీప్‌సింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి దృశ్యం
 
హైదరాబాద్:  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) సంయుక్తంగా కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) మేనేజ్‌మెంట్ అంశంపై స్వల్పకాలిక కోర్సుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు రెండు సంస్థల ప్రతినిధులు బుధవారం న్యూఢిల్లీలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశారని ఐఎస్‌బీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ సి.చిట్టిపంతులు తెలిపారు. ఐఐసీఏ డెరైక్టర్ జనరల్, సీఈఓ డాక్టర్ భాస్కర్ చటర్జీ, ఐఎ్‌స్‌బీ డిప్యూటీ డీన్ ప్రదీప్‌సింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. కార్పొరేట్ యాక్ట్ 2013 ప్రకారం దేశంలోని కంపెనీలన్నీ తమ ఆదాయంలో రెండు శాతం నిధులను సీఎస్‌ఆర్ కార్యక్రమాల క్రింద వ్యయం చేయాలని స్పష్టం చేశారు. దీంతో దేశంలోని 16వేల కంపెనీలు ఈ సీఎస్‌ఆర్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రతి యేటా నిర్వహించేం దుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐసీఏ ద్వారా ఇప్పటికే తొమ్మిది నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్సును అక్టోబర్ 2014లో ఒక కోర్సును ప్రారంభించి నిర్వహిస్తున్నారు. 

16 వారాల కాలపరిమితితో కూడిన నూతన కోర్సును జూన్, 2015 నుంచి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఐఎస్‌బీ మెహలి, హైదరాబాద్‌లలో సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తాయి. ఈ కోర్సులో 35 నుంచి 40 మంది చేరడానికి అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌లలో ఆరు నుంచి ఏడు ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ఈ కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తారు. ఈ కోర్సు తరగతులను హైబ్రీడ్ కంబైనింగ్ క్లాస్ రూమ్స్, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నిర్వహిస్తారు. మూడు వారాల పాటు క్యాంపస్ కాంటాక్ట్ క్లాసులను మిగతావాటిని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement