యూనిటెక్‌ నష్టాలు రూ.73 కోట్లు

Unitech Q1 net loss widens to Rs 73 cr - Sakshi

 భారీగా తగ్గిన ఆదాయం

న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ కంపెనీ యూనిటెక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.16 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.73  కోట్లకు ఎగిశాయని యూనిటెక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.289 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.78 కోట్లకు తగ్గింది.

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,272 కోట్ల ఆదాయం రూ.218 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయని కారణంగా కంపెనీ ఎమ్‌డీలు ఇద్దరూ–సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్ర జైలు శిక్ష గడుపుతున్నారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top