రెండు కొత్త మెర్సిడెస్‌ ‘ఏఎంజీ’ కార్లు.. | Two new Mercedes 'AMG' cars | Sakshi
Sakshi News home page

రెండు కొత్త మెర్సిడెస్‌ ‘ఏఎంజీ’ కార్లు..

Nov 8 2017 1:03 AM | Updated on Nov 8 2017 11:08 AM

Two new Mercedes 'AMG' cars - Sakshi

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ తాజాగా తన ‘ఏఎంజీ’ శ్రేణిలో ‘సీఎల్‌ఏ 45’, ‘జీఎల్‌ఏ 45’ అనే రెండు మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్‌–ఏఎంజీ సీఎల్‌ఏ 45 ప్రారంభ ధర రూ.75.20 లక్షలుగా, సీఎల్‌ఏ 45 ఏరో ఎడిషన్‌ ప్రారంభ ధర రూ.77.69 లక్షలుగా ఉంది.

ఇక మెర్సిడెస్‌–ఏఎంజీ జీఎల్‌ఏ 45 ప్రారంభ ధర రూ.77.85 లక్షలుగా, జీఎల్‌ఏ 45 ఏరో ఎడిషన్‌ ప్రారంభ ధర రూ.80.67 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఇండియావి. భారత్‌లో పెర్ఫార్మెన్స్‌ కార్‌ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమ వృద్ధికి ప్రోడక్ట్‌ ఇన్నోవేషన్‌ చాలా కీలకమని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో రోనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement