టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌100 ‘ఐ–టచ్‌ స్టార్ట్‌’ | TVS XL 100 i-Touch Start launched in India, priced at Rs 36109 | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌100 ‘ఐ–టచ్‌ స్టార్ట్‌’

Nov 22 2018 1:05 AM | Updated on Nov 22 2018 1:05 AM

TVS XL 100 i-Touch Start launched in India, priced at Rs 36109 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తెలంగాణ మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ ఫీచర్‌తో ఎక్స్‌ఎల్‌100 హెవీ డ్యూటీ ‘ఐ–టచ్‌ స్టార్ట్‌’ మోడల్‌ను ప్రవేశపెట్టింది. లీటరు పెట్రోల్‌కు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మినరల్‌ పర్పుల్‌ కలర్‌ను తొలిసారిగా పరిచయం చేశారు. మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉం ది. 4 స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌తో 99.7 సీసీ హెవీడ్యూటీ ఇంజిన్, డ్యూరా గ్రిప్‌ టైర్, హెవీ డ్యూటీ షాక్‌ ఆబ్జార్బర్, డబుల్‌ సీటు, వేరుచేయదగ్గ వెనుక సీటు, మెటల్‌ బాడీ, క్రోమ్‌ సైలెన్సర్‌ గార్డ్‌ ఇతర ప్రత్యేకతలు. 130 కిలోల బరువు మోయగలదు. హైదరాబాద్‌ ఎక్స్‌ షోరూంలో ఈ మోడల్‌ ధర రూ.37,649. మూడేళ్ల వారంటీ ఉంది. 


నెలకు 70,000 యూనిట్లు.. 
టీవీఎస్‌ ప్రస్తుతం ఎక్స్‌ఎల్‌ 100, ఎక్స్‌ఎల్‌ 100 కంఫర్ట్, ఎక్స్‌ఎల్‌ 100 హెవీ డ్యూటీ, ఎక్స్‌ఎల్‌ 100 హెచ్‌డీ ఐ–టచ్‌ స్టార్ట్‌ మోడళ్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా నెలకు 70,000 యూనిట్లు రోడ్డెక్కుతున్నాయని సంస్థ యుటిలిటీ ప్రొడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.వైద్యనాథన్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఎక్స్‌ఎల్‌ సిరీస్‌ను 1979లో ప్రవేశపెట్టాం. ఇప్పటి వరకు 1.35 కోట్ల యూనిట్లు విక్రయించాం. భారత్‌లో టాప్‌–10 బ్రాండ్లలో ఎక్స్‌ఎల్‌ ఒకటి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, ఒరిస్సాలో ఈ మోపెడ్స్‌ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి’ అని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement