టొయోటా యారిస్‌ లాంచ్‌..

Toyota Yaris launched in India priced at Rs 8.75 lakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త టయోటా యారిస్‌ను  లాంచ్ చేసింది. టొయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 8.75 లక్షలు ఎక్స్-షోరూమ్( ఢిల్లీ) గా కంపెని నిర్ణయించింది. కస్టమర్లకు ఆకట్టుకునేలా టొయోటా యారిస్ సి-సెగ్మెంట్ సెడాన్ కార్లతో పోల్చుకుంటే  ఫ్రంట్ డిజైన్‌ను చాలా అట్రాక్టివ్‌గా రూపొందించింది. ఫ్రంట్ డిజైన్‌లో బంపర్‌పై బిగ్‌ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న స్లీక్ హెడ్‌ల్యాంప్ డిజైన్, టయోటా లోగోకు ఇరువైపులా క్రోమ్ స్లాట్, బంపర్‌కు ఇరువైపులా కర్వీ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ అమర్చింది.  జె, జి, వి ,  విఎక్స్ అనే నాలుగు విభిన్న వేరియంట్లలో  యారిస్‌ లభ్యమవుతోంది.  మ్యాన్యువల్,  ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ రెండువెర్షన్లలోనే ఇవి లభిస్తాయి.
టొయోటా యారిస్‌ నాలుగు వేరియంట్ల ధరలు( ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

వేరియంట్‌             ఎంటీ            సీవీటీ
జే రూ. 8,75,000 రూ. 9,95,000
జీ రూ.10,56,000 రూ. 11,76,000
వీ రూ.11,70,000 రూ.12,90,000
వీఎక్స్ రూ.12,85,000 రూ.14,07,000

టొయోటా యారిస్ ఇంజీన్‌ ఇతర  స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..1.5-లీటర్ డ్యూయల్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజీన్‌ను అమర్చింది. ఇది గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్‌,  140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. యారిస్ అన్ని వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు. కాగా యారిస్ పెట్రోల్  వేరియంట్‌లో ఆటోమేటిక్ మోడల్ మైలేజ్ లీటరుకు 17.8కిలోమీటర్లు,  మ్యాన్యువల్ వేరియంట్ 17.1కిమీ/లీ  మైలేజ్  ఇస్తుంది.

 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‍, 4.2-అంగుళాల ఎమ్ఐడి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్  ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, పవర్ డ్రైవర్ సీటు, రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, ఆంబియంట్ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, కప్ హోల్డర్స్ గల రియర్ ఆర్మ్ రెస్ట్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్లు,  60:40 నిష్పత్తిలో ముడుచుకునే రియర్ సీట్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

భద్రత పరంగా టొయోటా యారిస్ సెడాన్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  టాప్ ఎండ్ వేరియంట్లో హిల్-స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సెంట్రల్ లాంకింగ్, రియర్ కెమెరా అదే విధంగా ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మారుతి  సుజుకి సియాజ్‌, హోండా సిటీ,  హ్యుందాయ్‌ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్‌ వెంటో కార్లకు ఇది గట్టిపోటీగా నిలవనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top