టయోటా ‘ఎతియోస్‌ క్రాస్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌ | Toyota rolls out Etios Cross variant at Rs 6.64 lakh | Sakshi
Sakshi News home page

టయోటా ‘ఎతియోస్‌ క్రాస్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

Sep 29 2017 12:58 AM | Updated on Sep 29 2017 3:16 AM

Toyota rolls out Etios Cross variant at Rs 6.64 lakh

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ తాజాగా తన ‘ఎతియోస్‌ క్రాస్‌’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ ‘ఎతియోస్‌ క్రాస్‌ ఎక్స్‌’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6.64 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. ఇది పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

దీన్లో రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, బాడీ కలర్‌ క్లాడింగ్, కొత్త సీట్‌ ఫ్యాబ్రిక్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. కొత్తగా ఆవిష్కరించిన ఎతియోస్‌ క్రాస్‌ ఎక్స్‌ ఎడిషన్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్స్‌లో పలు మార్పులు చేశామని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అకిటోషి టకెముర తెలిపారు. ఈ వేరియంట్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement