breaking news
etios Cross X
-
టయోటా ‘ఎతియోస్ క్రాస్’ లిమిటెడ్ ఎడిషన్
న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ తాజాగా తన ‘ఎతియోస్ క్రాస్’లో లిమిటెడ్ ఎడిషన్ ‘ఎతియోస్ క్రాస్ ఎక్స్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6.64 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దీన్లో రివర్స్ పార్కింగ్ కెమెరా, బాడీ కలర్ క్లాడింగ్, కొత్త సీట్ ఫ్యాబ్రిక్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. కొత్తగా ఆవిష్కరించిన ఎతియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్‌లో ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్‌లో పలు మార్పులు చేశామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అకిటోషి టకెముర తెలిపారు. ఈ వేరియంట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
టయోటా ఇటియోస్ క్రాస్ ఎక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ టయోటా కంపెనీ క్రాసోవర్ వాహనం, ఇటియోస్ క్రాస్ ఎక్స్ ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలోపెట్టుకుని కొస్మొటిక్ ఫీచర్స్‌ను అప్ గ్రేడ్ చేసిన దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. రూ. 6.88 లక్షలు రూ. 8.22 లక్షల మధ్య ఉండనున్నాయి.( ఎక్స్ షోరూ కోలకత్తా)డ్యాష్ బోర్డును కార్బన్ ఫైబర్‌తో కొత్తగా రూపొందించింది. 6.8 ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్‌ను కూడా అదనంగా చేర్చింది. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరాగా ఉపయోగపడనుంది. టయోటా ఇటియోస్ క్రాస్ ఎక్స్ 1.2 పెట్రోల్, 1.4 డీజిల్ ఇంజీన్ వెర్షన్‌తో, 5 స్పీడ్ మాన్యుయల్ ట్రాన్సిమిషన్‌తో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లో 80పీఎస్ గరిష్ట శక్తి . 104 ఎన్ఎమ్ టార్క్, 17.71 కెంపీఎల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్ 68పీఎస్ శక్తిని , 170ఎన్ఎం టార్క్‌ను , 23.59 కెఎంపీఎల్ను అందిస్తుంది.