భారీగా పెరిగిన బంగారం ధర | today gold price | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన బంగారం ధర

Jun 1 2020 10:46 AM | Updated on Jun 1 2020 10:48 AM

today gold price - Sakshi

సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటి మార్కెట్లో మొన్నటి ముగింపుతో పోలిస్తే రూ.662 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ.47,185 వద్ద ట్రేడ్‌అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర భారీగా పెరిగింది.మొన్నటితో పోలిస్తే 20 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,757.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగతుండడం, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చితి పరిస్థితులు పసిడి ధర పరుగుకు దోహదం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. దేశీయంగా వివాహాదీ శుభకార్యాలకు కొంత సడలింపునివ్వడం, మరో రెండు నెలల వరకు పెళ్లిళ్లకు శుభముహుర్తాలు కూడా లేకపోవడంతో దగ్గరి బంధువుల సమక్షంలో పెళ్లిళ్లు చేసేందుకు  ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తుండడంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. ఈ కారణంతో కూడా పసడిధరలు పుంజుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement