10 శాతం పెరిగిన టైటాన్‌ లాభం

Titan Profits Growth 10 Percent in This Fiscal Year - Sakshi

రూ.364 కోట్లకు నికర లాభం  

16 శాతం వృద్ధితో రూ.5,095 కోట్లకు అమ్మకాలు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 10 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.328 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.364 కోట్లకు పెరిగిందని టైటాన్‌ తెలిపింది. నికర అమ్మకాలు రూ.4,407 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.5,095 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,020 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.4,687 కోట్లకు చేరాయని కంపెనీ వివరించింది. 

ఆభరణాల ఆదాయం రూ.4,164 కోట్లు....
వాచ్‌ల విభాగం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.716 కోట్లకు, జ్యూయలరీ విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.4,164 కోట్లకు, కళ్లజోళ్ల విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.1,32 కోట్లకు పెరిగాయని టైటాన్‌ తెలిపింది. నిర్వహణ లాభం 14 శాతం వృద్ధితో రూ.565 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇన నిర్వహణ లాభ మార్జిన్‌లో పెద్దగా పురోగతి లేకుండా 11.4 శాతంగానే ఉంది. ఇతర ఆదాయం రూ.56 కోట్లుగా ఉండగా, వడ్డీ వ్యయాలు రూ.68 కోట్లని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటం, వినియోగం మందగమనంగా ఉండటంతో కొన్ని విభాగాలపై ప్రభావం పడిందిన కంపెనీ ఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు, ప్రత్యేక ఆభరణాల కలెక్షన్‌ల కారణంగా ఆభరణాల విభాగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టైటాన్‌ కంపెనీ షేర్‌ 0.2 శాతం లాభంతో రూ.1,038 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top