వాహన ధరలు పెంచుతాం | Tata Motors, Renault plan price hike from April | Sakshi
Sakshi News home page

వాహన ధరలు పెంచుతాం

Mar 26 2014 2:12 AM | Updated on Sep 2 2017 5:09 AM

వాహన ధరలు పెంచుతాం

వాహన ధరలు పెంచుతాం

టాటా మోటార్స్‌తో పాటు రెనో ఇండియా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తోంది. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పదని వాహన కంపెనీలు భావిస్తున్నాయి.

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌తో పాటు రెనో ఇండియా  వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తోంది. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పదని వాహన కంపెనీలు భావిస్తున్నాయి. వాణిజ్య వాహనాల ధరలను 1% వరకూ పెంచాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల వాహనాల ధరలను 1-2% పెంచనున్నట్లు ఈ కంపెనీ చెప్పడం తెలిసిందే.  ఇక రెనో ఇండియా కూడా ధరలను పెంచనున్నది.

అయితే ఎంత వరకూ ధరలను పెంచాలనే విషయమై ఈ కంపెనీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కరెన్సీలతో రూపాయి మారకం ఒడిదుడుకులు ఇంకా తగ్గలేదని, ఈ ఒత్తిడి ప్రభావం ఉంటుందని, కొంత భారానైనా వినియోగదారులకు బదిలీ చేయక తప్పదని రెనో ఇండియా కంట్రీ సీఈవో, ఎండీ సుమిత్ సాహ్న పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఫారెక్స్ ఒడిదుడుకులు 25 శాతంగా ఉన్నాయని, కానీ ఏ కంపెనీ కూడా 25 శాతం వరకూ ధరలను పెంచలేదని పేర్కొన్నారు.  కాగా హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ధరల పెంచనున్నాయని ఇప్పటికే ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement