నార్వే యారా చేతికి టాటా కెమికల్స్ యూరియా వ్యాపారం | Tata Group sells Urea business to Pune-based Yara Fertilizers India | Sakshi
Sakshi News home page

నార్వే యారా చేతికి టాటా కెమికల్స్ యూరియా వ్యాపారం

Aug 11 2016 1:12 AM | Updated on Sep 4 2017 8:43 AM

నార్వే యారా చేతికి టాటా కెమికల్స్ యూరియా వ్యాపారం

నార్వే యారా చేతికి టాటా కెమికల్స్ యూరియా వ్యాపారం

టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఫెర్టిలైజర్స్‌కు విక్రయించనుంది.

డీల్ విలువ రూ.2,670 కోట్లు

 ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కెమికల్స్ కంపెనీ తన యూరియా వ్యాపారాన్ని నార్వేకు చెందిన యారా ఫెర్టిలైజర్స్‌కు విక్రయించనుంది. తమ యూరియా వ్యాపారాన్ని యారా ఫెర్టిలైజర్స్‌కు రూ.2,670 కోట్లకు విక్రయించనున్నట్లు టాటా కెమికల్స్ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బర్బల యూరియా ప్లాంట్‌ను యారా కంపెనీకి విక్రయిస్తామని పేర్కొంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులని పేర్కొంది. ఈ డీల్ ఏడాది కాలంలో పూర్తవగలదని అంచనా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement