గ్యాస్ ధరలపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీం | Sakshi
Sakshi News home page

గ్యాస్ ధరలపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీం

Published Fri, Sep 19 2014 1:44 AM

గ్యాస్ ధరలపై కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీం - Sakshi

న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి(కేజీ) బేసిన్ నుంచి లభించే గ్యాస్‌కు ధరను నిర్ణయించడంలో ప్రణాళికలేమిటన్నది వివరించాల్సిందిగా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఈ విషయంలో గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలను అవలంబించనున్నారా లేక వీటిపై వాదనలకు తెరలేపనున్నారా అంటూ ప్రశ్నించింది. ఇదీ కాకుంటే ఇతర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా అన్న విషయాలను తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితిని వెల్లడించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. గ్యాస్ ధరల అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది.  గ్యాస్ ధరను రెట్టింపు చేయడంపై సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తాతోపాటు, ఎన్‌జీవో కామన్‌కాజ్ అనే సంస్థ 2013లో  ప్రజోపయోగ వ్యాజ్యాన్ని(పీఐఎల్) దాఖలు చేశాయి.

Advertisement
Advertisement