తీహార్ జైల్లోనే సుబ్రత రాయ్ | subrata roy to be in tihar jail only, orders supreme court | Sakshi
Sakshi News home page

తీహార్ జైల్లోనే సుబ్రత రాయ్

Apr 9 2014 1:46 PM | Updated on Sep 2 2017 5:48 AM

సహారా గ్రూపు అధినేత సుబ్రత రాయ్ని తీహార్ జైల్లోనే ఉంచుతాం తప్ప.. గృహ నిర్బంధానికి పంపేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సహారా గ్రూపు అధినేత సుబ్రత రాయ్ని తీహార్ జైల్లోనే ఉంచుతాం తప్ప.. గృహ నిర్బంధానికి పంపేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాయ్ తమ కస్టడీలో ఉన్నారు తప్ప ఆయనను తాము పౌర ఖైదుకు పంపలేదని వ్యాఖ్యానించింది. సుబ్రత రాయ్ జైల్లో ఉన్నందున సుప్రీంకోర్టు చెప్పినంత మొత్తం సేకరించడం కష్టంగా ఉందని, అందువల్ల ఆయనను గృహ నిర్బంధానికి పంపాలని కోరుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ కోరినప్పుడు సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతర్జాతీయ వ్యాపార వేత్తలు ఎవరూ జైలుకు వచ్చి బేరాలు చేయడానికి ఇష్టపడరని, అందువల్ల ఇంటికి పంపితే అక్కడ బేరసారాలు కుదుర్చుకుని, కట్టాల్సిన సొమ్ము సేకరించడానికి ప్రయత్నం చేస్తారని రాం జెఠ్మలానీ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆయన వాదనను తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement