మోతీలాల్‌ ఓస్వాల్‌..టాప్‌-5 స్టాక్‌ రికమెండేషన్లు

stock recomandations - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ కొన్ని దేశాల్లో పరిస్థితులు మెరుగు పడుతుండడంతో...పరిశ్రమల్లో ఉత్పత్తులు పుంజుకుంటున్నాయి. మరికొన్ని దేశాల్లో కేసులు అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లాక్‌డౌన్‌ నింబధనల్లో భారీ సడలింపులను ఆయా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. దీంతో అతిత్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో కనిపిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయని ఈ సమయంలో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలు విక్రయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ....ఐదు షేర్లను బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సు చేస్తోంది. అవి ఈ విధంగా ఉన్నాయి. 

కంపెనీ పేరు: విప్రో
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: తటస్థంగా ఉంచింది
టార్గెట్‌ ధర: రూ.188
ప్రస్తుత ధర: రూ.216

ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో షేరు రేటింగ్‌ను తటస్థంగా ఉంచుతున్నట్లు బ్రోకరేజ్‌సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. షేరు టార్గెట్‌ ధరను రూ.188 గా నిర్ణయించింది. విప్రో కొత్త సారధిగా థియోరీ డెలాపోర్ట్‌ను విప్రో కంపెనీ ఎంపిక చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఈయన గత కొన్నేళ్లుగా క్యాప్‌జెమినీలో సీఓఓగా పనిచేస్తున్నారు. జూన్‌ 6 నుంచి విప్రో కంపెనీ సీఈవో,ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఇతర టెక్నాలజీ కంపెనీలతో పోలిస్తే విప్రో వృద్ధి పరంగా వెనుకంజలో ఉంది. కొత్త సీఈఓ మార్గనిర్దేశనంలో కంపెనీ వృద్ధి పుంజుకుంటుందని బ్రోకరేజ్‌ సం‍స్థ అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కాగా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో విప్రో కన్సాలిడేటెడ్‌ విక్రయాలు రూ.15711 కోట్లు నమోదైయ్యాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో విప్రో షేరు ధర రూ.216.40 గా ఉంది.

కంపెనీ పేరు: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.615
ప్రస్తుత ధర: రూ.564

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ బయ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం-22లో పీఈ 13 అంచనాతో టార్గెట్‌ ధరను రూ.615గా నిర్ణయించింది. 50 మిలియన్‌డాలర్లు వెచ్చించి సిస్కో సెల్ఫ్‌ ఆప్టిమైజింగ్‌ నెట్‌వర్క్‌(ఎస్‌ఓఎన్‌)ను సొంతం చేసుకోకున్నట్లు హెచ్‌సీఎల్‌ ప్రకటించిందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఎస్‌ఓఎస్‌ అనేది 2జీ నుంచి 5జీ వరకు రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌లను అందిస్తుంది. 5 జీ నవీకరణలో ఎస్‌ఓఎన్‌ ప్రధాన పాత్ర పోషిస్తునందున ఈ కొనుగోలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్‌ను మరింత బలోపేతం చేస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. కాగా ఈ కొనుగోలు ఒప్పందం జనవరి 21 నాటికి పూర్తవుతుందని, సిస్కో నుంచి కొంత మంది ఉద్యోగులను హెచ్‌సీఎల్‌కు తీసుకుంటారని మోతీలాల్‌ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేరు ధర రూ.564.75 గా ఉంది.

కంపెనీ పేరు: నెస్లే ఇండియా
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: తటస్థంగా ఉంచింది
టార్గెట్‌ ధర: రూ.16,385
ప్రస్తుత ధర: రూ.17,524

నెస్లే ఇండియా షేరు రేటింగ్‌ను బ్రోకరేజ్‌ సంస్థ తటస్థంగా ఉంచింది. ఆర్థిక సంవత్సరం-22లో పీఈ 60 అంచనాతో టార్గెట్‌ ధరను రూ.16,385గా నిర్ణయించింది.  సీవై19 వార్షిక నివేదిక నెస్లే ఇండియా బలాన్ని ప్రస్పుటిస్తుందని, భారతీయ మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అగ్రశ్రేణి సంస్థగా నిలిచిందని బ్రోకరేజ్‌ సంస్థ  తెలిపింది. వరుసగా మూడో ఏడాది రెండంకెల విక్రయాలు జరిపిందని తెలిపింది. పాలు,పోషక పదార్థాల విక్రయాల్లో 5 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందని, చాక్లెట్‌ విక్రయాల్లో 9 ఏళ్ల వృద్దిని నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో నెస్లే ఇండియా షేరు ధర రూ.17,524.25గా ఉంది.

కంపెనీ పేరు: లుపిన్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1,000
ప్రస్తుత ధర: రూ.857

లుపిన్‌ కంపెనీ షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇస్తునట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.ఏడాదికాలానికిగాను పీఈ 22 అంచనాతో షేరు టార్గెట్‌ ధరను రూ.1,000గా నిర్ణయించింది. మూడేళ్ల ఆదాయాల క్షీణత తర్వాత ఆర్థిక సంవత్సరం20-21లలో లుపిన్‌ కంపెనీ వృద్ధి మెరుగుపడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తోంది. దేశీయ ఫార్ములేషన్‌ మార్కెట్లో లుపిన్‌ ప్రదర్శన స్థిరంగా ఉంటుందని చెబుతూ ఈషేరును కొనుక్కోవచ్చని ఇన్వెస్టర్లకు సూచిస్తుంది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో లుపిన్‌ షేరు ధర రూ.857.10 గా ఉంది.

కంపెనీ పేరు: జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.515
ప్రస్తుత ధర: రూ. 464

జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ షేరుకు బయ్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఆర్థిక సంవత్సరం-21లో ఇబిటా 5 రెట్లు, ఆర్థిక సంవత్సరం-22లో ఇబిటా 4 రెట్లు అంచనాతో టార్గెట్‌ ధరను రూ.515 గా నిర్ణయించింది. మూడేళ్ల తరువాత ఈ కంపెనీ మార్జిన్లు క్రమంగా మెరుగు పడుతున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఫార్మాలోనూ, స్పెషాలిటీ బిజినెస్స్‌లోనూ వృద్ధి కనిపిస్తుందని వెల్లడించింది. కాగాబీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు ధర రూ.464.35 గా ఉంది.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top