స్పైస్జెట్ నుంచి డోర్ టు డోర్ కార్గొ సేవలు
ఆదాయ వనరులు పెంచుకునే దిశగా చౌక ఛార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డోర్ టు డోర్ కార్గొ డెలివరీ సేవలు ప్రారంభించాలని యోచిస్తోంది.
న్యూఢిల్లీ: ఆదాయ వనరులు పెంచుకునే దిశగా చౌక ఛార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ డోర్ టు డోర్ కార్గొ డెలివరీ సేవలు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సర్వీసులు ప్రారంభించే అవకాశా ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. స్పైస్‌జెట్ ఇప్పటికే మూడు టన్నుల లోపు సామర్ధ్యం ఉండే 100 ట్రక్కులకు ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించాయి. అలాగే దేశవ్యాప్తంగా 40 గిడ్డంగుల కోసం కూడా స్థలాన్ని లీజుకు తీసుకుంటున్నట్లు ఆయా వర్గాలు వివరించాయి.స్పైస్‌జెట్ గణాంకాల ప్రకారం దేశీయంగా కార్గొ విభాగం ఏటా 15-17 శాతం వృద్ధి నమోదు చేస్తోంది.


