స్పైస్‌జెట్ మొబైల్ యాప్ | SpiceJet Mobile App | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్ మొబైల్ యాప్

Jun 25 2015 12:35 AM | Updated on Sep 3 2017 4:18 AM

స్పైస్‌జెట్ మొబైల్ యాప్

స్పైస్‌జెట్ మొబైల్ యాప్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వినియోగదారుల సౌలభ్యం కోసం ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.

న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వినియోగదారుల సౌలభ్యం కోసం ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకి ంగ్, టికెట్ రద్దు చేసుకోవడం వంటి తదితర కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని స్పైస్‌జెట్ పేర్కొంది. ఆండ్రాయిడ్, విండోస్ స్మార్ట్‌ఫోన్లలో పనిచేసే ఈ యాప్‌లో విమానాల రాకపోకలను, వాటి ప్రయాణ సమయాలను, వీటిలో కలిగే మార్పులు, రిఫండ్స్ తదితర వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది. టికెట్ బుకింగ్ చెల్లింపులను క్విక్ పే, క్రెడిట్ పే, డెబిట్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి  రూపాల్లో చేయవచ్చని పేర్కొంది. బ్యాగేజ్‌ని డిస్కౌంట్ ధరల్లో ముందస్తు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement