దక్షిణ కొరియాలో 'బ్రెగ్జిట్ బాంబు' | South Korea financial authorities 'holding emergency discussions' | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాలో 'బ్రెగ్జిట్ బాంబు'

Jun 24 2016 12:10 PM | Updated on Sep 4 2017 3:18 AM

దక్షిణ కొరియాలో 'బ్రెగ్జిట్ బాంబు'

దక్షిణ కొరియాలో 'బ్రెగ్జిట్ బాంబు'

ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బ్రెగ్జిట్ ఉదంతం దక్షిణ కొరియాను కూడా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక నిపుణులతో అధికారులతో చర్చలకు దిగింది.

 ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బ్రెగ్జిట్ ఉదంతం దక్షిణ కొరియాను కూడా కుదిపేస్తోంది.  ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక నిపుణులతో అధికారులతో  చర్చలకు దిగింది.     ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాల ప్రభావాన్ని  అంచనా వేయడానికి  దేశ ఆర్ధిక,  ద్రవ్య అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహస్తోందని యాన్ హ్యాప్ న్యూస్  ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.  యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడంతో ఆ  పరిణామాలను   ఎదుర్కొనేందుకు... సంబంధిత చర్యలకుపక్రమిస్తోందని తెలిపింది.  ఈ భారీ  పతనం  నుంచి తప్పించుకునే మార్గాలపై  చర్చించటానికి అత్యవసర సమావేశం నిర్వహిస్తోందని నివేదించింది. 

కాగా  బ్రెగ్జిట్ సంక్షోంతో దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్లు శుక్రవారం అతలాకుతలమయ్యాయి.  గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనంతో  ద.కొరియా మార్కెట్లు కూడా  అల్లకల్లోలంగా  ఉన్నాయని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement