సోనీ ఆండ్రాయిడ్‌ టీవీ...ధర వింటే

Sony 75 Inch 4K HDR LED Android TV in X9500G Series Launched  - Sakshi

75 అంగుళాల  సోనీ ఆండ్రాయిడ్‌ ఎల్‌ఈడీ టీవీ

ధర : రూ.4,49,990

సోనీ సంస్థ అద్భుతమైన  మరో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఎక్స్‌9500జీ సిరీస్‌లో మరో బిగ్‌ టీవీని తీసుకొచ్చింది. 75 అంగుళాల స్క్రీన్‌తో సోనీ 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని ‘‘కేడీ75 ఎక్స్‌9500జీ’’ పేరుతో  భారత మార్కెట్లో అవిష్కరించింది.  దీని ధరను రూ. 4,49,990 గా నిర్ణయించింది.  

దేశవ్యాప్తంగా సోనీ సెంటర్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్ల ద్వారా  ఈ సూపర్‌ టీవీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ  వెల్లడించింది. మామూలు ఎల్‌ఈడీ టీవీల  కంటే ఆరు రెట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్‌ అందిస్తుందని కంపెనీ చెప్పింది. 

ఆండ్రాయిడ్‌ 8.0 సపోర్టుతో  లభిస్తున్న 75 అంగుళాల స్ర్కీన్‌, బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ.  ఇంకా 3840x2160 పీక్సెల్స్‌ రిజల్యూషన్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌, ఎక్స్‌1 అల్టిమేట్‌ పిక్చర్‌ ప్రాసెసర్‌, ఫుల్‌ అర్రే లోకల్‌ డిమ్మింగ్‌ బ్యాక్‌లైట్‌, అల్ట్రా వైడ్‌ వ్యూయింగ్‌ యాంగిల్‌, నెట్‌ఫ్లిక్స్‌ కాలిబ్రేటెడ్‌ మోడ్‌, 16 జీబీ స్టోరేజ్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top