బ్యాడ్‌న్యూస్‌ : ఆ పథకాల వడ్డీరేట్లు తగ్గింపు | Small savings scheme's interest rates cut by 20 bps  | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌న్యూస్‌ : ఆ పథకాల వడ్డీరేట్లు తగ్గింపు

Dec 28 2017 1:16 PM | Updated on Dec 28 2017 3:46 PM

Small savings scheme's interest rates cut by 20 bps  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్‌ చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై అందించే వడ్డీరేట్లను ప్రభుత్వం నేడు తగ్గించింది. జనవరి-మార్చి కాలంలో వడ్డీరేట్లను, ప్రస్తుతమున్న వడ్డీరేట్లకు 0.2 శాతం తగ్గించినట్టు పేర్కొంది. ఈ తగ్గించిన రేట్ల పథకాల్లో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ), సుకన్య సమృద్ధి అకౌంట్‌, కిసాన్‌ వికాస్‌ పాత్ర(కేవీపీ), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) ఉన్నాయి. అయితే ఐదేళ్ల సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ వడ్డీరేటును 8.3 శాతంగానే ఉంచింది. సీనియర్‌ సిటిజన్స్‌ స్కీమ్‌ వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా చెల్లిస్తారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా మారుస్తూ వస్తోంది. 

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ వార్షిక రేటు 7.6 శాతంగా కాగ, కేవీపీ వడ్డీరేటు 7.3 శాతంగా పేర్కొంది. అదేవిధంగా సుకన్య సమృద్ధి అకౌంట్‌ ప్రస్తుతమున్న రేటును 8.3 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. 1-5 ఏళ్ల టర్మ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను 6.6 శాతం నుంచి 7.4 శాతంగా ఉంచింది. క్వార్టర్లీ ఈ వడ్డీరేట్లను చెల్లిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను క్వార్టర్లీ ఆధారితంగా నోటిఫై చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను ప్రభుత్వ బాండ్‌ దిగుబడులను లింక్‌ చేస్తూ చెల్లిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేయనున్నది. త్వరలో బ్యాంకుల్లో వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గటం ఖాయమని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement