స్కైక్వాడ్‌ ప్లాంటులో స్కైవర్త్‌ టీవీలు | Skyquad Electronics ties up with China Skyworth | Sakshi
Sakshi News home page

స్కైక్వాడ్‌ ప్లాంటులో స్కైవర్త్‌ టీవీలు

Jun 1 2018 1:32 AM | Updated on Jun 1 2018 1:32 AM

Skyquad Electronics ties up with China Skyworth - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ స్కైక్వాడ్‌ ఎలక్ట్రానిక్స్‌ చైనాకు చెందిన టీవీ బ్రాండ్‌ స్కైవర్త్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మేడ్చల్‌ వద్ద ఉన్న స్కైక్వాడ్‌ ప్లాంటులో స్కైవర్త్‌ బ్రాండ్‌ ఎల్‌ఈడీ టీవీల అసెంబ్లింగ్‌ కోసం ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. స్కైవర్త్‌ ఇండియా ఎండీ డేనియల్‌ సాంగ్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ యూనిట్‌ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు కంపెనీ వర్గాలు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపాయి.

14 నుంచి 55 అంగుళాల టీవీలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే కంపెనీ ఆరు బ్రాండ్లతో చేతులు కలిపింది. ప్లాంటులో ఈ బ్రాండ్ల కోసం ఎల్‌ఈడీ ల్యాంప్స్, బల్బŠస్, ట్యూబ్స్, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్‌ పీసీలు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్లను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్లాంటుకై రూ.100 కోట్లకుపైగా వెచ్చించారు. 1,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. హై వాల్యూమ్‌ టెలివిజన్‌ మార్కెట్లో విస్తరణకు తాజా ఒప్పందం దోహదం చేస్తుందని స్కైక్వాడ్‌ సీఈవో రమిందర్‌ సింగ్‌ సోయిన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement