మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌ | Skoda Launch Rapid Rider Limited Edition | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

Jul 17 2019 8:29 AM | Updated on Jul 17 2019 8:29 AM

Skoda Launch Rapid Rider Limited Edition - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ యూరోపియన్‌ కార్ల తయారీ సంస్థ ‘స్కోడా’... భారత మార్కెట్లో తన మిడ్‌–సైజ్‌ సెడాన్‌ ‘రాపిడ్‌’ స్పెషల్‌ ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా (ఎక్స్‌–షోరూం) కంపెనీ ప్రకటించింది. యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్, డ్యుయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి అత్యవసర భద్రతా ఫీచర్లను కలిగిన ఈ పరిమిత ఎడిషన్‌.. 1.6 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇతర ఫీచర్ల పరంగా.. వెనుక పార్కింగ్‌ సెన్సార్లు, యాంటీ గ్లేర్‌ ఇంటీరియర్‌ రియర్‌ వ్యూ మిర్రర్, విండ్‌స్క్రీన్‌ డీఫాగర్, రఫ్‌ రోడ్‌ ప్యాకేజ్, ఫ్లోటింగ్‌ కోడ్‌ సిస్టమ్‌తో కూడిన ఇంజిన్‌ ఇమ్మొబిలైజర్‌ ఉన్నట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement