సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Sensex Surges Over 200 Points To Close At Record High Of 40470 - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ నష్టాలు చెక్‌ చెప్పడంతోపాటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  దలాల్‌ స్ట్రీట్‌ రికార్డుల మోత మోగింది.  కీలక సూచీ సెన్సెక్స్‌ 40,600, నిఫ్టీ 12వేల పాయింట్ల స్థాయిని టచ్‌ చేసాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 40470 వద్ద రికార్డు ముగింపునిచ్చింది. నిఫ్టీ  కూడా 49పాయింట్ల ఎగిసి 11967 వద్ద స్థిరపడింది.  రియల్టీ,  మెటల్‌,బ్యాంకింగ్‌ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. అయితే  ఆరోపణలపై  టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వివరణ ఇవ్వడంతో ఇన్ఫీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. సిప్లా, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెడ్‌ఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు లాభపడగా, టైటన్‌, భారతిఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్‌, మారుతి సుజుకి నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top