కొత్త గరిష్టాల వద్ద స్టాక్‌మార్కెట్లు | Sensex Soars Over 500 Points, Nifty near to all time High | Sakshi
Sakshi News home page

కొత్త గరిష్టాల వద్ద స్టాక్‌మార్కెట్లు

Nov 25 2019 2:44 PM | Updated on Nov 25 2019 2:46 PM

Sensex Soars Over 500 Points, Nifty near to all time High - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. యుఎస్-చైనా వాణిజ్య పరిణామాలపై  అనుకూల అంచనాలతో ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి కొత్త గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ఇంట్రా డేలో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా ఎగిసింది.  ప్రస్తుతం  471 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌ 40827 వద్ద, నిఫ్టీ 141 పాయింట్లు ఎగిసి 12055  వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్‌ ఆల్‌ టైం గరిష్టాన్ని నమోదు చేయడగా నిఫ్టీ దీనికి మరో 50 పాయింటలు దూరంగా ఉంది.  దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. 

భారతి ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌, వేదాంతా,  హెచ్‌డీఎఫ్‌ఎసీ, సన్‌ఫార‍్మా, హీరో మోటో, యాక్సిస్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడుతున్నాయి. మరోవైపు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యస్‌బ్యాంకు, ఎన్‌జీసీ, ఐటీసీ, విప్రో, పవర్‌ గ్రిడ్‌, గెయిల్‌, ఐసీఐసీఐ బ్యాకునష్టపోతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement