
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. గత సెషన్‌లో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో ఆరంభంలోనే 500 పాయిట్లు ఎగిసాయి. అటు ఆసియా మార్కెట్లు దీనికి మరింత ఊతమిచ్చాయి. అయితేప్ర స్తుతం సెన్సెక్స్ 188 పాయింట్ల లాభాలకు పరిమితమై మళ్లీ 41 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ 54 పాయింట్లు లాభంతో 12048 వద్ద ట్రేడవుతోన్నాయి. ఐటీ, టెక్నాలజీ మినహా అన్ని రంగాల కౌంటర్లు లాభాల్లో ట్రేడవుతోన్నాయి. బ్యాంకింగ్ షేర్లకు భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది.ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, సన్‌పార్మా, టాటా స్టీల్ లాభపడుతున్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హీరోమోటో, పవర్‌గ్రిడ్ నష్టపోతున్నాయి.