సరిహద్దులో మళ్లీ టెన్షన్: మార్కెట్లు క్రాష్‌ | Sensex sheds over 200 pts on border tension; Nifty below 9,400 | Sakshi
Sakshi News home page

సరిహద్దులో మళ్లీ టెన్షన్: మార్కెట్లు క్రాష్‌

May 23 2017 4:00 PM | Updated on Sep 5 2017 11:49 AM

సరిహద్దులో మళ్లీ టెన్షన్: మార్కెట్లు క్రాష్‌

సరిహద్దులో మళ్లీ టెన్షన్: మార్కెట్లు క్రాష్‌

పాకిస్తాన్ పోస్టులపై భారత ఆర్మీ జరిపిన దాడులతో సరిహద్దులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.

పాకిస్తాన్ పోస్టులపై భారత ఆర్మీ జరిపిన దాడులతో సరిహద్దులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో దేశీయ మార్కెట్లు క్రాష్‌ అయ్యాయి. సెన్సెక్స్ 205.72 పాయింట్లు క్రాష్ అయి 30,365 వద్ద, నిఫ్టీ 52.10 పాయింట్లు నష్టపోయి 9,400 మార్కుకు దిగువన 9,386 వద్ద ముగిసింది. 20,21 తేదీల్లో కశ్మీర్ నౌషేరా సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ శిబిరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు జరిపినట్టు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. మార్కెట్లో ట్రేడింగ్ ముగియడానికి అరగంట ముందు ఈ దాడులు విషయాన్ని భారత ఆర్మీ రివీల్ చేయడంతో దేశీయ సూచీలు క్రాష్ అయ్యాయి.
 
అంతేకాక ఫార్మా, రియాల్టీ స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో కూడా మార్కెట్లు పడిపోయాయి. సన్ ఫార్మా, సిప్లా రెండు సూచీల్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి.  అదానీ పోర్ట్స్ కూడా 6 శాతం మేర నష్టపోయింది. మారుతీ సుజుకీ, మహింద్రా అండ్ మహింద్రా, ఐషర్ మోటార్స్, హిందాల్కోలు లాభాలు పండించాయి. మరోవైపు అంతర్జాతీయంగానూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 22 పైసలు మేర నష్టపోయి, 64.77 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 83 రూపాయల లాభంలో 28,868గా ట్రేడయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement