
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం 100పాయింట్లకు పైగా ఎగిసింది. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకుంది. తిరిగి స్వల్పంగా పుంజుకున్నా, ప్రస్తుతం సెన్సెక్స్27 పాయింట్లు క్షీణించి 37646 వద్ద,నిప్టీ 20 పాయింట్లు కోల్పోయి 11155 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ (10) బీపీసీఎల్, ఇండస్ ఇండ్, సన్‌ఫార్మ, హీరో మోటో, ఎల్ అండ్‌టీ, ఐషర్ మోటార్స్ భారీగా నష్టపోతుండగా, యస్ బ్యాంకు 4 శాతం , వేదాంతా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా లాభపడుతున్నాయి.