దలాల్‌ స్ట్రీట్‌లో రికార్డుల మెరుపులు | Sensex, Nifty Hit Record Highs | Sakshi
Sakshi News home page

దలాల్‌ స్ట్రీట్‌లో రికార్డుల మెరుపులు

Dec 17 2019 3:52 PM | Updated on Dec 17 2019 3:52 PM

Sensex, Nifty Hit Record Highs  - Sakshi

సాక్షి,ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో నేడు(మంగళవారం) రికార్డుల హోరెత్తింది.అంతర్జాతీయ  సానుకూల సంకేతాలతో ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసిన కీలక సూచీలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ వరుస రికార్డులను నమోదు చేయడంతోపాటు హై స్థాయిల వద్ద రికార్డు క్లోజింగ్‌వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల కళ కళల్లాడాయి. సెన్సెక్స్‌ 413 పాయింట్లు ఎగిసి 41,352 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 12165 వద్ద ముగిసాయి.  బ్యాంకింగ్‌ షేర్ల మద్దతుతో నిఫ్టీ బ్యాంకు రికార్డు స్థాయిలను సాధించింది.

టాటా స్టీల్‌, భారతి ఎయిర్‌ టెల్‌, వేదాంతా, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ టీసీఎస్‌, ఐటీసీ యస్‌ బ్యాంకు టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు గెయిల్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఆటో, నష్టపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement