కోవిడ్-19 కు మందు : లాభాల హై జంప్

Sensex leaps 700 points Nifty crosses 9800 - Sakshi

కరోనా వైరస్: రెమెడిసివిర్ ఔషధం సానుకూల ఫలితాలు

9800 పైకి నిఫ్టీ 

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. కోవిడ్-19 చికిత్సకు ప్రయోగాత్మక రెమెడిసివిర్ ఔషధానికి సానుకూల ఫలితాలతో అంతర్జాతీయ సానుకూల సంకేతాలను అంది పుచ్చుకున్న కీలక సూచీలు ఆరంభంలోనే భారీ లాభాలను సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్  909 పాయింట్ల లాభంతో 33601 వద్ద, నిఫ్టీ 253 పాయింట్లు ఎగిసి 9808 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 33600 వేలను అధిగమించగా,  నిఫ్టీ 9800 పాయింట్లను దాటేసింది. అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.  ఈ నెల డెరివేటివ్ సిరీస్ ఈ రోజు ముగియనుంది.

ఫార్మ, బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల షేర్లు భారీగా లాభపడుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు 700 పాయింట్లు ఎగిసి 21500 స్థాయిని దాటింది. టాటా మోటార్స్ 10 శాతం, మారుతి 8 శాతం ఎగిసింది. ఇంకా వేదాంతా, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ లాభపడుతున్నాయి. హెచ్ యూఎల్,  జెట్ ఎయిర్ వేస్, హెక్సావేర్ నష్టపోతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top