
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు యూ టర్న్ తీసుకుని లాభాల్లోకి మళ్లాయి. బలహీనమైన ట్రెండ్ నుంచి పాజిటివ్‌ట్రెండ్‌లోకి మారాయి. రోజు కనిష్టం నుంచి ఏకంగా 350 పాయింట్లకు పైగా ఎగిసింది. సెన్సెక్స్ ప్రస్తుతం176 పాయింట్ల లాభంతో 39,292 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 11,740 వద్ద ట్రేడవుతోంది. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌కు మార్కెట్లకు ఊతమిస్తోందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్ రంగాలు లాభపడుతున్నాయి. రుపీ బలపడటంతో ఐటీ 0.5 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.25 శాతం చొప్పున నీరసించాయి. మరోవైపు ఇటీవల భారీగా కుదేలైన జెట్ ఎయిర్‌వేస్ ఏకంగా 32 శాతం ఎగిసింది. ప్రస్తుతం 23శాతం లాభాలతో కొనసాగుతోంది. అడాగ్ షేర్లు కూడా రీబౌండ్ అయ్యాయి.