స్టాక్ మార్కెట్ పై క్రూడ్ పంజా, భారీ నష్టాలు! | Sensex falls most in over 4 mths as Iraq unrest drives up oil | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ పై క్రూడ్ పంజా, భారీ నష్టాలు!

Jun 13 2014 4:35 PM | Updated on Sep 2 2017 8:45 AM

స్టాక్ మార్కెట్ పై క్రూడ్ పంజా, భారీ నష్టాలు!

స్టాక్ మార్కెట్ పై క్రూడ్ పంజా, భారీ నష్టాలు!

ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల దాడితో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్‌ ధర పెరుగడం, ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి...

హైదరాబాద్: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల దాడితో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్‌ ధర పెరుగడం, ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 59.69 రూపాయలను నమోదు చేసుకోవడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీగా నష్టపోయాయి. 
 
నిన్నటి ముగింపుకు సెన్సెక్స్  348 పాయింట్ల పతనంతో 25228 పాయింట్ల వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 7542 పాయింట్ల వద్ద ముగిసాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలో పతనమవ్వడం గత నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. 
 
క్రూడ్ ధర, పెరగడం, ద్రవ్య మార్కెట్ లో రూపాయి పతనం కావడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీయడంతో సుమారు 12 రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 
 
సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 8 శాతం, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, ఎన్ఎమ్ డీసీ, యాక్సీస్ బ్యాంక్, కంపెనీలు 45 శాతానికి పైగా నష్టపోయాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, హెచ్ యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్పోసిస్ కంపెనీల షేర్లు స్వల్పంగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement