ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ అవుతుంది..!!

SBI Net Banking May Get Blocked If Mobile Number Is Not Registered By December 1 - Sakshi

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్లకు అలర్ట్‌. అంతకముందు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌తో మొబైల్‌ నెంబర్‌ను రిజిస్ట్రర్‌ చేసుకోని కస్టమర్లందరూ 2018 డిసెంబర్‌ 1 కల్లా ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. ఒకవేళ తుది గడువు లోపల రిజిస్ట్రర్‌ చేసుకోకపోతే, నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ అవుతుందని ఎస్‌బీఐ తెలిపింది. వారు ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలను యాక్సస్‌ చేసుకోలేరని పేర్కొంది. దగ్గర్లోని బ్రాంచు ద్వారా ఈ పక్రియను వెంటనే చేపట్టుకోవాలని సూచించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 2017 జూలై 6న దీనిపై సర్క్యూలర్‌ జారీ చేయడంతో, ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల కోసం తప్పనిసరిగా తమ కస్టమర్ల మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రర్‌ ప్రక్రియ చేపట్టాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఒకవేళ ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌తో మొబైల్‌ నెంబర్‌ను రిజిస్ట్రర్‌ చేసుకోకపోతే, వెంటనే యూజర్లు దాన్ని చేపట్టాలని పేర్కొంది. అంతేకాక, బ్యాంక్‌ వద్ద ఇప్పటికే రిజిస్ట్రర్‌ చేసుకున్న యూజర్లు కూడా మొబైల్‌ నెంబర్‌ను చెక్‌ చేసుకోవాలని తెలిపింది.   

ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌తో మొబైల్‌ నెంబర్‌ రిజిస్ట్రర్‌ అయిందో లేదో చెక్‌ చేసుకునే ప్రక్రియ....

  • onlinesbi.com అనే ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదు చేయాలి
  • ఆ తర్వాత ‘మై అకౌంట్‌ అండ్‌ ప్రొఫైల్‌’ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి
  • ‘ప్రొఫైల్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి
  • పర్సనల్‌ డిటైల్స్‌/మొబైల్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి
  • ఆ తర్వాత ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి(ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌, యూజర్‌ పాస్‌వర్డ్‌ వేరువేరుగా ఉండాలి)
  • ఒక్కసారి ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌, ఈమెయిల్‌(ముందే రిజిస్ట్రర్‌ అయి ఉంటే) డిస్‌ప్లే అవుతుంది.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top