
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు శాంసంగ్ భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆపిల్‌కు పోటీగా, ప్రీమియం ఫీచర్లతో తీసుకొచ్చిన లేటెస్ట్ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ప్లస్ త్వరలోనే భారత మార్కెట్లను పలకరించనుంది. ఎస్ సిరీస్లో శాన్‌ఫ్రాసిస్కోలో బుధవారం (ఫిబ్రవరి 10) ఆవిష్కరించిన ఎస్ 10ప్లస్, ఎస్ 10, ఎస్10ఈ డివైస్‌లను మార్చి 8న నుంచి దేశీయంగా అందుబాటులోకితీసుకొచ్చామని శాంసంగ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
1 టీబీ, 512 జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఎస్ 10 ప్లస్ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా రూ.1,17,900, రూ. 91,900 రూ. 73,900గా ఉండనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 ధర 128జీబీ వేరియంట్ రూ.66,900, 512 జీబీ వేరియంట్ ధర్ రూ. 84,900గా ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10ఈ రూ. 55,900లకు లభించనుంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, టాటా క్లిక్ లాంటి ఇతర రీటైల్ అవుట్ లెట్లలో మార్చి 5వ తేదీనుంచి ప్రీ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రీబుకింగ్ చేసుకున్న వారు మార్చి 6వ తేదీనుంచి ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. మార్చి 8నుంచి విక్రయాలు ప్రారంభం. అయితే శాంసంగ్‌కు చెందిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ భారత మార్కెట్లలో ఎపుడు లభించేది స్పష్టం చేయలేదు.
గెలాక్సీ ఎస్10 ప్లస్ ఫీచర్లు
6.4 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్
ఆండ్రాయిడ్ 9.0 పై
12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్
12+12+16 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
చైనా మార్కెట్ సహా, ప్రపంవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్న క్రమంలో ఆపిల్ సంస్థకు శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కౌంటర్ ప్రింట్ రీసెర్చ్ సమాచారం ప్రకారం భారతీయ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ 2018లో 8శాతం వృద్ధిని నమోదు చేయగా, 34 శాతం మార్కెట్‌వాటా శాంసంగ్ సొంతం. అయితే ఆపిల్ 23 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.