హెల్థీ ఫుడ్‌ విక్రయాలు రెట్టింపు

sales of immunity boosting foods double    - Sakshi

లాక్‌డౌన్‌లో... రెట్టింపైన ఇమ్యూనిటి బూస్ట్‌ ఫుడ్స్‌ విక్రయాలు 

లాక్‌డౌన్‌ కాలంలో రోగ నిరోధకతను పెంచే ఆహార ఉత్పత్తుల విక్రయాలు 20-40 శాతం పెరిగాయని గూగుల్‌ ఒక నివేదికలో తెలిపింది.  కోవిడ్‌-19నుంచి తమను తాము రక్షించుకునేందుకు రోగనిరోధకత పెంచే ఆహార పదార్థాలు ఏమేం ఉన్నాయో తెలుసుకునే ఆన్‌లైన్‌ యూజర్ల సంఖ్య 6 రెట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఆయుర్వేద వంటింటి మూలికలు, తిప్పతీగ, విటమిన్‌ C లభించే ఆహార పదార్థాల గురించి అధికంగా అన్వేశించారని గూగుల్‌ తెలిపింది.ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, వాట్సాప్‌ వంటి వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన సమాచారాన్ని సేకరించి వాటి ద్వారా గూగుల్‌లో ఆయా పదార్థాలు వెతుకుతున్నారు. చవన్‌ప్రాశ్‌, హెల్త్‌బార్స్‌, ప్రముఖ బ్రాండెడ్‌ హెల్త్‌ సాల్ట్‌ల కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయని స్పెన్సర్స్‌ రిటైల్‌ అండ్‌ నేచుర్స్‌ బాస్కెట్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ దేవేంద్ర చావ్లా వెల్లడించారు.రాబోయే రోజుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారంతోపాటు, రోగ నిరోధక శక్తిని పెంచే విభాగంలో మరిన్ని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.ఇప్పటికే ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ కొత్తగా వస్తున్న ఉత్పత్తులను సైతం వినియోగదారులు ఆదరిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

 కోవిడ్‌-19 తర్వాత..
కోవిడ్‌ తర్వాత ఆరోగ్యసంరక్షణ, ముఖ్యంగా ఆయుర్వేదం ప్రాముఖ్యతతోపాటు, వ్యక్తిగత పరిశుభ్రతపై వినియోగదారుల్లో మంచి అవగాహన పెరుగుతోందని డాబర్‌ ఇండియా చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ మొహిత్‌ మల్హోత్రా అన్నారు. వినియోగదారులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మరింత ఆరోగ్య సంరక్షణ  అందించే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో హల్త్‌కేర్‌ ఇండస్ట్రీ లాభాల్లో నడుస్తుందన్నారు. ఇక వ్యక్తిగత శుభ్రతలో ప్రముఖ పాత్ర వహించే ఉత్పత్తులైన హ్యాండ్‌ శానిటైజర్లు నేటి జీవన శైలిలో నిత్యవసరాలయ్యాయి.నెలవారి గ్రాసరీ బాస్కెట్లో ఇప్పుడు ఇది చేరపోయింది. దీంతో  శానిటైజర్ల విభాగంలో వృద్ధి భారీగా నమోదైందని మల్హోత్రా అన్నారు. 
  బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న విప్రో కూడా ఇప్పటికే  శానిటైజర్‌కు బదులుగా సూక్ష్మ జీవుల నుంచి రక్షణ కల్పించే యార్డ్‌లే ఫ్రాగ్రెన్స్‌ అనే  పాకెట్‌ ఫెర్‌ఫ్యూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ వీపీ వ్యాపార ముఖ్య అధికారి మనిష్‌ వ్యాస్‌ వెల్లడిచారు. ఈ స్ప్రేను ఒక్కసారి కొట్టుకుంటే గంట పాటు కంటికి కనిపించని క్రిముల నుంచి రక్షణ పొందవచ్చని మనిష్‌ తెలిపారు.

వెజ్జీక్లీన్‌..
పారాచూట్‌ ఆయిల్‌ తయారీ కంపెనీ మారికో కూడా కూరగాయలు, పండ్లను శుభ్రం చేసే వెజ్జీ క్లిన్‌ ఆయల్‌ను అదుబాటులోకి తెచ్చింది.ఐటీసీ రూ.50 పైసలకే ఒకసారి వాడి పడేసే  శానిటైజర్‌ సాచెట్స్‌ను మార్కెట్లోకి తీసుకురాగా, రూ.1కి లభించే శానిటైజర్‌ను కెవిన్‌కేర్‌ అందిస్తోంది. కాగా ఏప్రిల్‌ నెలలో 56 శాతం మంది వినియోగదారులు తమఖర్చులలో ఎక్కువ భాగం ఆరోగ్యం, ఆర్గానిక్‌ ఫుడ్‌, మెడికల్‌ అవసరాలు, ఫిట్‌నెస్‌, మెడికల్‌ ఇన్సురెన్స్‌ వంటివాటికి వెచ్చిస్తున్నట్లు చెప్పారని మార్కెట్‌ పరిశోధనా సంస్థ నెల్సన్‌ ఓ నివేదికలో తెలిపింది. హ్యాండ్‌ శానిటైజర్స్‌,ఫ్లోర్‌క్లీనర్స్‌, హ్యాండ్‌ వా
ష్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగిందని, ఈ నేపథ్యంలో 152 కోత్త కంపెనీలు మార్కెట్లోకి అడుగుపెట్టడంతో హ్యాండ్‌ శానిటైజర్ల ఉత్పత్తి నాలుగురెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. 
మరోపక్క రోగనిరోధకతను పెంచే బిస్కెట్లు, స్నాక్స్‌, సాల్ట్‌ వాటర్‌, ఖాక్రా వంటి అన్ని ఉత్పత్తుల తయారీ తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌​‍్స అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలకు అనుగుణంగా జరగాలని చెబుతోంది. అంతేగాకుండా ఈ నిబంధనలకు తమ వెబ్‌సైట్‌లో కోవిడ్‌ పేజిని ప్రత్యేకంగా నడుపుతున్నామని దీనిలో అన్ని నిబంధనలు సవివరంగా ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ-ఇన్‌స్పెక‌్షన్స్‌ అనే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  ఉత్పత్తులకు అప్రూవల్స్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top