రిజిస్ట్రేషన్ల ఆధారంగా అమ్మకాల డేటా..! | Sales Data With Vehicle Registrations | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల ఆధారంగా అమ్మకాల డేటా..!

Sep 13 2019 11:19 AM | Updated on Sep 13 2019 11:19 AM

Sales Data With Vehicle Registrations - Sakshi

న్యూఢిల్లీ: వాహనాల నెలవారీ అమ్మకాల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల ఆధారంగా రూపొందించాలని ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌)ను కోరింది. ఇందుకోసం హోల్‌సేల్స్‌ను కాకుండా, రహదారి మంత్రిత్వ శాఖకు వాహన్‌ ప్లాట్‌ఫాం సమాచారాన్ని వినియోగించుకోవాలని సియామ్‌కు లేఖరాసింది. ఈ విధానం ద్వారా మెరుగైన సమాచారం అందుతుందని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్‌ హర్షరాజ్‌ కాలే అన్నారు. ఇక తాజాగా సియామ్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆటో పరిశ్రమ అమ్మకాలు కనిష్ట స్థాయిలను నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 31.57 శాతం క్షీణించాయని వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement