సాక్షి ప్రాపర్టీ షో నేడే

Sakshi Property Show at Shilpakalavedika on 9 nov 2019

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోలు అంత ఆషామాషీ పనేం కాదు. నమ్మకమైన బిల్డర్, నాణ్యమైన నిర్మాణం, గడువులోగా ప్రాజెక్ట్‌ పూర్తి, ఆధునిక వసతులు, తక్కువ ధర.. ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్‌ ఎక్కడుందో వెతకాలంటే కష్టమే. మరి ఇలాంటి ప్రాజెక్ట్‌లన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొస్తే.. అదే ‘సాక్షి ప్రాపర్టీ షో’!

ప్రాజెక్ట్‌ ఎంపిక నుంచి గృహ రుణం వరకూ నిర్మాణ సంస్థలను, బ్యాంక్‌లను ఒకే చోటికి తీసుకొచ్చి కొనుగోలుదారులకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది సాక్షి. నేడు, రేపు మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ముఖ్య అతిథిగా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, రెరా చైర్మన్‌ సోమేశ్‌ కుమార్‌ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం.

40కి పైగా స్టాళ్ల ఏర్పాటు..
నగరానికి చెందిన 20కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు, 40కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. ఇలా అన్ని రకాల గృహ ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? సొంతింటి కొనుగోలు నిర్ణయంలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. మరి ఆలస్యమెందుకు? వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి.. నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి.

ప్రధాన స్పాన్సర్‌: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌
అసోసియేటెడ్‌ స్పాన్సర్‌: రాంకీ ఎస్టేట్స్‌
కో–స్పాన్సర్స్‌: జనప్రియ ఇంజనీర్స్, మ్యాక్, ఎన్‌సీసీ అర్బన్, స్పేస్‌ విజన్‌

పాల్గొనే సంస్థలు: ఈఐపీఎల్‌ ప్రాజెక్ట్స్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్, గ్రీన్‌ మార్క్‌ డెవలపర్స్, గిరిధారి హోమ్స్, శ్రీ ఆదిత్య హోమ్స్, ప్రణీత్‌ గ్రూప్, ఆర్వీ నిర్మాణ్, కపిల్‌ ప్రాపర్టీస్, గ్రీన్‌ సిటీ ఎస్టేట్స్, ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్‌ హోమ్స్, పేరం గ్రూప్, వర్టుసా లైఫ్‌ స్పేసెస్, చరణ్‌ గ్రూప్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top