నేడే సాక్షి ప్రాపర్టీ షో

Sakshi property Show In Kukatpally

హైదరాబాద్‌లో మెట్రో పరుగులు మొదలయ్యాయి. స్థిరాస్తి మార్కెట్టూ సానుకూలంగా మారింది. ఇలాంటి సమయంలో అందుబాటు ధరల్లో సొంతిల్లు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారా? మీకా శ్రమక్కర్లేకుండా ‘సాక్షి ప్రాపర్టీ షో’ మీ ముందుకొచ్చింది. ఒకే వేదికగా నగరంలోని నివాస, వాణిజ్య, కార్యాలయ సముదాయాల వివరాలను అందించేందుకు సిద్ధమైంది. మరెందుకు ఆలస్యం.. వెంటనే కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపానికి విచ్చేసి.. నచ్చిన స్థిరాస్తిని సొంతం చేసుకోండి!

సాక్షి, హైదరాబాద్‌: 2017లో స్థిరాస్తి రంగానికి సవాల్‌ విసిరినవి.. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లే! ఆయా నిర్ణయాలతో ఒక్కసారిగా రియల్‌ రంగం కుదేలైంది. నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మెట్రో రైలు కూతతో సానుకూల వాతావరణం నెలకొంది. మెట్రోతో మార్కెట్‌ మెరుగవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనడంలో సందేహమక్కర్లేదు. కాబట్టి సొంతింటి ఎంపికకు సాక్షి ప్రాపర్టీ షోనే సరైన వేదిక.

హైదరాబాద్‌ డెవలపర్లతో పాటూ బెంగళూరు, ముంబై ఇతర నగరాల నిర్మాణ సంస్థలూ భాగ్యనగరంలో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నా యి. ఎక్కువగా గేటెడ్‌ కమ్యూనిటీ, ఆకాశహర్మ్యాలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. లగ్జరీ విల్లాలు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్పులు కూడా ఉన్నాయి. దేశంలోని ఏ ఇతర మెట్రో నగరాలతో పోల్చినా సరే నేటికీ నగరం లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. శివారు ప్రాంతాలకు వెళితే చ.అ.కు రూ.1,600లు దొరికే ప్రాంతాలున్నాయంటే ధరలను అర్థం చేసుకోవచ్చు.

రెండు రోజుల పాటు జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో నిర్మాణ సంస్థలు బ్యాంకులు, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థలు పాల్గొని ప్రాజెక్ట్‌లు, రుణాల గురించి సందర్శకులకు వివరిస్తాయి. రుణమెంత లభిస్తుందో అక్కడిక్కడే తెలుసుకొని ఇంటికి సంబంధించిన అంతిమ నిర్ణయాన్ని సులువుగా తీసుకోవచ్చు.

ప్రధాన స్పాన్సర్‌: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌
అసోసియేట్‌ స్పాన్సర్స్‌: ఆదిత్య, రాంకీ, గ్రీన్‌మార్క్‌ డెవలపర్స్‌
కో–స్పాన్సర్‌: ప్రణీత్‌ గ్రూప్, ఇతర సంస్థలు: జనప్రియ, సాకేత్, ఏఆర్కే టెర్మినస్, ఆర్వీ నిర్మాణ్, గ్రీన్‌ఎకర్స్, ఫారŠూచ్యన్‌ బటర్‌ఫ్లై సిటీ, ఎస్‌ఆర్‌జీవీ వెంచర్స్, తరుణి,  చీదెల్లా హౌజింగ్‌ ప్రై.లి., గ్రీన్‌ ఎన్‌ హోమ్, యాక్సాన్‌ హౌజింగ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)

నగరం నలువైపులా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌ల వివరాలను తెలుసుకోవటం కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప వీటి సమాచారం తెలియదు. అలాంటిది ఒకే చోట నగరంలోని నివాస, వాణిజ్య సముదాయాల వివరాలన్నింటినీ తెలుసుకునే వీలు కల్పిస్తోంది సాక్షి ప్రాపర్టీ షో. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు? అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏయే రాయితీలను అందిస్తున్నారు? వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో ఇలాంటి సమాచారం తెలిస్తేనే కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది.

వేదిక: శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మండపం, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top