విజయవాడలో రేపు సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్
పొదుపు, పెట్టుబడులపై మదుపరులలో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ సదస్సు ఆదివారం
పొదుపు, పెట్టుబడులపై మదుపరులలో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ సదస్సు ఆదివారం విజయవాడలో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా నిర్వహించిన ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులకు చక్కని స్పందన రావటంతో... ఈ సదస్సు నిర్వహణకు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్) సాక్షితో జతకట్టాయి.
ఆదివారం సాయంత్రం విజయవాడ గాంధీనగర్, హనుమాన్‌పేట్‌లోని చెట్లపల్లి మారుతీ ప్రసన్న లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ సదస్సులో సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజరు వనిశెట్టి శివప్రసాద్, ఎస్‌హెచ్‌సీఐఎల్ రీసెర్చ్ అనలిస్ట్ ముప్పవరపు రవికుమార్ పాల్గొంటారు. వీరు ఇన్వెస్టర్ల సందేహాలు తీర్చటంతో పాటు వారికి వివిధ ఇన్వెస్ట్‌మెంట్ విధానాలపై తగు సూచనలిస్తారు. ఉచిత రిజిస్ట్రేషన్ తదితరాల కోసం 9505555020 ఫోన్ నెంబర్లో సంప్రతించవచ్చు.


