సాక్షి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ పూర్తి | Sakshi Entrepreneur of the Year Award | Sakshi
Sakshi News home page

సాక్షి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ పూర్తి

Apr 28 2015 1:00 AM | Updated on Sep 3 2017 12:59 AM

సాక్షి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ పూర్తి

సాక్షి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ పూర్తి

సాక్షి మీడియా గ్రూప్ తొలిసారి అందజేయనున్న ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’లో భాగంగా ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు షార్ట్ లిస్ట్ ప్రక్రియ పూర్తయింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాక్షి మీడియా గ్రూప్ తొలిసారి అందజేయనున్న ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’లో భాగంగా ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు షార్ట్ లిస్ట్ ప్రక్రియ పూర్తయింది. ఇన్నోవేషన్‌తో సహా 2014లో పారిశ్రామికవేత్తగా విజయం సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి నలుగురిని షార్ట్ లిస్ట్ చేశారు. ఫ్యాప్సీ అధ్యక్షుడు శివ్‌కుమార్ రుంగ్టా, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(హెచ్‌ఎంఏ) అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యదేవర, సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ హరీష్ చంద్రప్రసాద్ ఈ ప్రక్రియకు జ్యూరీగా వ్యవహరించారు.

జ్యూరీ షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాను... వివిధ రంగాలకు చెందిన నిపుణులుండే ఫైనల్ జ్యూరీ పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తుంది.
 
పూర్తి పారదర్శకంగా... అవార్డుల ఎంపికలో పారదర్శకత కోసం ఆడిటింగ్ సంస్థ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఈ పాయింట్ సిస్టమ్ ఆధారంగా ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ జాబితాను షార్ట్‌లిస్ట్ చేశారు. దీనిపై జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన ముగ్గురూ సంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా దరఖాస్తులు రావటం అభినందనీయమన్నారు.
 
ఆహ్వానించదగ్గ పరిణామం
ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు ఎక్కువగా పోటీపడుతున్నాయి. వీటిలో అత్యధికం యువత నుంచి వచ్చినవే.  వినూత్న ఆలోచనలు వీరి సొంతం.  పది మందికీ ఉపాది కల్పిచే పారిశ్రామికవేత్తలనుప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక విభాగానికే కాకుండా సామాజిక కోణంలో అన్ని రంగాలను ప్రోత్సహించేలా ‘సాక్షి’ అవార్డులు ఉండడం ఆహ్వానించతగ్గది.     
-వై.హరీష్‌చంద్ర ప్రసాద్ సీఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ చైర్మన్
 
అన్ని విభాగాల నుంచీ...
ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్‌తోపాటు పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని అవార్డులతో వెన్నుతట్టడం ఆనందంగా ఉంది. ఎక్సలెన్స్ అవార్డులతో ‘సాక్షి’ తీసుకున్న చొరవ అభినందనీయం. వినూత్న వ్యాపారాలను నిర్వహిస్తున్న స్టార్టప్‌లు ఇందులో పోటీపడుతున్నాయి. అన్ని వ్యాపార విభాగాల నుంచి నామినేషన్లు వచ్చాయి. చిన్న పట్టణాల నుంచీ దరఖాస్తులు వచ్చాయి.  
- శివ్ కుమార్ రుంగ్టా, ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ
 

మరిన్ని విభాగాలుండాలిై
రెతులు మొదలుకుని పారిశ్రామికవేత్తల వరకు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులివ్వడం అభినందనీయం. రానున్న రోజుల్లో మరిన్ని విభాగాలను అవార్డుల కింద జోడించాలని కోరుకుంటున్నాను. ఎక్సలెన్స్ అవార్డులు సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తాయి. ఏటా ఇలా అవార్డులు ఇచ్చి పారిశ్రామికవేత్తలను సత్కరించాలి. భారీ పరిశ్రమలకు అలాగే ఎంఎస్‌ఎంఈకి వేర్వేరుగా ‘ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇస్తే బాగుండేది. మొత్తంగా ‘సాక్షి’ తీసుకున్న ఈ చొరవను అభినందిస్తున్నాను.
-శ్రీనివాస్ అయ్యదేవర,ప్రెసిడెంట్, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement